Hyderabad News: బోయిన్‌పల్లిలో తెరాస, భాజపా నాయకుల మధ్య ఘర్షణ

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఒకటో వార్డ్‌ బోయిన్‌పల్లిలో శిలాఫలకం విషయంలో తెరాస, భాజపా నాయకులు ఘర్షణ జరిగింది.

Published : 02 Jan 2022 11:57 IST

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఒకటో వార్డ్‌ బోయిన్‌పల్లిలో శిలాఫలకం విషయంలో తెరాస, భాజపా నాయకులు ఘర్షణ జరిగింది. తమ హయాంలో నిధులు మంజూరైతే భాజపా నాయకులు రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమం ఎలా చేస్తారంటూ తెరాస నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే శిలాఫలకాన్ని తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో తెరాస, భాజపా కార్యకర్తల మధ్య తోపులాట జరిగి కొట్టుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఎట్టి పరిస్థితుల్లో శిలాఫలకాన్ని ఏర్పాటు చేయనీయబోమని తెరాస నేతలు తేల్చిచెప్పారు. స్థానిక ఎమ్మెల్యే సాయన్న, కంటోన్మెంట్ సీఈవో అజిత్‌రెడ్డి లేకుండా రోడ్డును ఏ విధంగా ప్రారంభిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని