TS News: అక్టోబరు 14 తెలంగాణకు బ్లాక్‌ డే: పొన్నాల లక్ష్మయ్య

రాష్ట్ర పరిధిలో ఉన్న నీటి వ్యవహారాలపై కేంద్రం ఎందుకు అజమాయిషీ చేస్తుందని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. నీటిపై పెత్తనం చేయడానికి ప్రయత్నం

Published : 14 Oct 2021 02:42 IST

హైదరాబాద్‌: రాష్ట్ర పరిధిలో ఉన్న నీటి వ్యవహారాలపై కేంద్రం ఎందుకు అజమాయిషీ చేస్తుందని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. నీటిపై పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తున్న కేంద్రానిది, అందుకు అవకాశం ఇస్తున్న రాష్ట్రానిది రెండూ తప్పేనని పొన్నాల వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని.. తెలంగాణ ద్రోహిగా నిలిచిపోతారని పొన్నాల ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఒకేసారి జలయజ్ఞంలో భాగంగా  86 ప్రాజెక్టులు ప్రారంభించామని... కేసీఆర్‌ ఇప్పుడు వెలగబెట్టిందేముందని ప్రశ్నించారు. రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం వల్ల ఎంత లాభం జరుగుతుందో కేసీఆర్‌ చెప్పగలరా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఒంటెద్దు పోకడలు తెలంగాణకు నష్టం చేస్తున్నాయని విమర్శించారు. అక్టోబరు 14 తెలంగాణకు బ్లాక్‌డేగా నిలిచిపోతుందన్నారు. దేశ వ్యాప్తంగా బొగ్గులేక పవర్‌ ప్లాంట్‌లు మూతపడుతున్నాయని పొన్నాల తెలిపారు. అనేక రాష్ట్రాల్లో పవర్‌ కట్‌లు కొనసాగుతున్నాయని, భాజపా ఎన్ని అవాస్తవాలు ప్రచారం చేసినా వాస్తవ పరిస్థతి వచ్చేసరికి ప్రజలకు నిజం తెలుస్తుందన్నారు. కేంద్రం వద్ద భవిష్యత్‌ ప్రణాళిక లేకపోవడమే ఇప్పుడు బొగ్గు కొరతకు కారణమన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క మెగావాట్‌ పవర్ కూడా ఇప్పటి వరకు ఉత్పత్తి చేయలేదని పొన్నాల ఆక్షేపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు