Ts News: ఇంతటి దారుణానికి పాల్పడితే చర్యల్లేవా?: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు కారణమైన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేందర్‌ను వెంటనే అరెస్టు చేయాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి..

Published : 07 Jan 2022 01:42 IST

హైదరాబాద్‌: రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు కారణమైన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేందర్‌ను వెంటనే అరెస్టు చేయాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఒక ఎమ్మెల్యే కుమారుడు ఇంతటి దారుణానికి పాల్పడితే చర్యలు తీసుకోకపోవడం అత్యంత దారుణమన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డికి మంచి పేరుందని... సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటనలో నిందితుడైన రాఘవేందర్‌ను అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. చౌటుప్పల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పరిశ్రమల కారణంగా చాలా గ్రామాలు ప్రభావితమవుతన్నాయని ఎంపీ పేర్కొన్నారు. ఫార్మాసిటీ ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతమంతా నాశనమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బోర్ల నుంచి రసాయనాలతో కూడిన నీరు వస్తుండడంతో బతకలేని పరిస్థితులు ఏర్పడ్డాయని ఎంపీ వివరించారు. ఫార్మాసిటీ ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని కోమటిరెడ్డి హెచ్చరించారు.

రాఘవను తక్షణమే అరెస్టు చేయాలి: భట్టి

రాష్ట్రంలో సామాన్యులను రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలన్నీ అధికార పార్టీ కోసమే పనిచేస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. కొత్తగూడెంలో జిల్లా పాల్వంచలో కుటుంబం ఆత్మహత్య జరిగి మూడు రోజులైనా నిందితుడిని ఎందుకు అరెస్టు చేయలేదని.. పోలీసు యంత్రాంగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. పోలీస్‌ వ్యవస్థను పార్టీ అవసరాలకే వాడుకుంటున్నారని మండిపడ్డారు. వనమా రాఘవను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో సర్కార్‌ పట్టించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు తెరలేపుతామని భట్టి హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని