
Updated : 27 Sep 2021 14:09 IST
TS Assembly: అసెంబ్లీకి గుర్రపు బండ్లపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇవాళ తెలంగాణ అసెంబ్లీకి గుర్రపుబండ్లపై వచ్చారు. భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, సీతక్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి గుర్రపుబండ్లపై రావడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. కాగా, గుర్రపుబండ్లను అనుమతించాలని కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులు అనుమతికి నిరాకరించడంతో వారు అసెంబ్లీ గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నారాయణగూడ పీఎస్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడారు. ‘‘దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. పెట్రోల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో ప్రజలపై భారం పడుతోంది’’ అని అన్నారు.
ఇవీ చదవండి
Tags :