Komatireddy: వైఎస్‌ కుటుంబంతో అనుబంధం దృష్ట్యా వెళ్తున్నా: కోమటిరెడ్డి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి విజయమ్మ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానం అందిందని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి

Published : 02 Sep 2021 14:56 IST

హైదరాబాద్‌: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి విజయమ్మ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానం అందిందని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆత్మీయ సమ్మేళనానికి హాజరవుతున్నట్లు ఆయన చెప్పారు. వైఎస్‌ కుటుంబంతో తనకున్న అనుబంధం దృష్ట్యా వెళ్తున్నానని తెలిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనం రాజకీయాలకు అతీతమన్నారు. 

ఈ కార్యక్రమానికి గతంలో వైఎస్‌తో సన్నిహితంగా మెలిగినవారు, అప్పటి మంత్రిమండలిలో, కాంగ్రెస్‌లో పనిచేసిన వారిని విజయమ్మ ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి తదితర నేతలకు ఆహ్వానాలు అందినట్లు తెలిసింది. అయితే వైకాపా నేతలు ఈ సభకు వెళ్లరాదని ఆ పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు తెలంగాణలోని తెరాస, కాంగ్రెస్‌, భాజపాలాంటి పార్టీల్లో ఉన్న (గతంలో వైఎస్‌తో పనిచేసినవారు) వారిని సుమారు 350 మంది వరకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని