TS News: తెరాస అసమర్థత వల్లే రైతులకు ఇబ్బందులు: ఉత్తమ్‌కుమార్‌

తెరాస ప్రభుత్వం అసమర్థత వల్ల వరి రైతులు తీవ్రంగా ఇబ్బందులు

Updated : 28 Dec 2021 14:16 IST

హైదరాబాద్: తెరాస ప్రభుత్వం అసమర్థత వల్ల వరి రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్‌ ఎంపీ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. మంత్రులు అసమర్థత వల్లే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం ఆనాడు ధాన్యం కొనుగోళ్ల విషయంలో చెప్పిన దానికి మౌనంగా ఉండి.. ఇప్పుడు మంత్రులు గొడవకు దిగుతున్నారని విమర్శించారు. గత యాసంగిలో 52లక్షల ఎకరాల్లో వరి వేసిన రైతులను.. ఇప్పుడు అసలు వేయొద్దంటే ఎలా అని ఉత్తమ్‌ ప్రశ్నించారు. సింగరేణి గనుల ప్రైవేటీకరణపై పార్లమెంట్‌లో తెరాస ఎంపీలు మాట్లాడలేదని ఆక్షేపించారు. భాజపా, తెరాసలు అంతర్గతంగా పొత్తులోనే ఉన్నాయని ఉత్తమ్‌ ఆరోపించారు. 

‘‘పంట మార్పిడి జరగాలంటే దానికి రైతులను సమాయత్తం చేయాలి. ఉన్నట్టుండి వేయొద్దంటే అది అవగాహనా రాహిత్యం. ప్రతిగింజా కొంటామని అసెంబ్లీలో కేసీఆర్ చెప్పారు. ఇప్పుడేమో ఒక్క గింజా కొనం అంటున్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుప్పకూలాయి. ధాన్యం కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 వేల కోట్లు కేటాయిస్తే అసలు సమస్యే ఉండదు’’ అని ఉత్తమ్‌ అన్నారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు