
Huzurabad ByElection: హరీశ్‌రావు అక్కడ నుంచి వెళ్లిపోవాలి.. ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు
హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో మంత్రి హరీశ్‌రావు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్‌కు ఫిర్యాదు చేశారు. మంత్రి హోదాలో ఉన్న హరీశ్‌రావు ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తున్నారని తెలిపారు. నెల రోజుల నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలోనే ఉంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి హరీశ్‌రావు వెంటనే బయటకు రావాలని.. ప్రచారం చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.