Ts politics: సమస్యలపై రేవంత్‌రెడ్డి మాట్లాడితే మల్లారెడ్డి జీర్ణించుకోలేకపోయారు: మల్లు రవి
దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ వర్గాలకు లాభం జరగాలనే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు.
హైదరాబాద్: దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ వర్గాలకు లాభం జరగాలనే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని.. అందుకే రేవంత్ రెడ్డి సోనియాను తెలంగాణ తల్లిగా భావిస్తారని అన్నారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ దళిత, గిరిజనులను అణచివేస్తున్నారని మండిపడ్డారు. అర్హులైన దళిత, గిరిజన అధికారులకు ప్రాధాన్యత లేని పోస్టులు కేటాయించారని.. అగ్రవర్ణాల అధికారులు పదవీ విరమణ పొందాక కూడా తిరిగి విధుల్లో కొనసాగిస్తున్నారని తెలిపారు.
‘‘బడ్జెట్లో దళిత, గిరిజనులకు కేటాయించిన నిధులు ఎందుకని పూర్తిస్థాయిలో ఖర్చు చేయడం లేదు. సీఎం కేసీఆర్ అవలంబిస్తున్న దళిత గిరిజన వ్యతిరేక చర్యలను నిరసిస్తూనే కాంగ్రెస్ దండోరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాకు ఊహించిన దానికంటే ఎక్కువ జనం వస్తున్నారు. మూడుచింతలపల్లిలో దళితుల కష్టాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు. కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామంలో దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదు.
కేసీఆర్ దత్తత గ్రామంలో నెలకొన్న సమస్యలపై రేవంత్‌రెడ్డి మాట్లాడితే మంత్రి మల్లారెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. బాధ్యతగల మంత్రి స్థానంలో ఉన్న ఆయన రేవంత్‌పై ఇష్టానుసారం మాట్లాడటం సరైందేనా? మల్లారెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని నిరూపించాలి. ఈటల రాజేందర్‌పై విచారణ జరిపినట్లు మల్లారెడ్డిపై విచారణ జరిపించాలి. మల్లారెడ్డి రాజ్యాంగేతర శక్తిలా వ్యవహరిస్తున్నారు. ఆయనకు మంత్రిగా ఉండేందుకు అర్హత లేదు. కేసీఆర్ రాసిచ్చిన స్క్రిప్ట్ నే ఎమ్మెల్యేలు, మంత్రులు చదువుతున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదు. దళిత గిరిజనులకు న్యాయం జరిగేవరకు కాంగ్రెస్ పోరాటం ఆగదు’’ అని మల్లు రవి తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Rishi Sunak: సునాక్ మీరు బిలియనీరా..? బ్రిటన్ ప్రధాని సమాధానమిదే..
-
Sports News
IND vs AUS: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ.. అగ్గి రాజేశారు.. వారికి ఇది అలవాటే: అశ్విన్
-
India News
IndiGo: పట్నా వెళ్లాల్సిన ప్రయాణికుడు ఉదయ్‌పుర్‌కు.. ‘ఇండిగో’లో ఘటన!
-
Sports News
Asia Cup 2023: ఆసియా కప్ 2023.. నిర్వహణ ఎక్కడో రేపే తేలనుందా..?
-
World News
USA: భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్‌కు షాక్..!
-
India News
Akhilesh Yadav: అఖిలేశ్ యాదవ్‌కు తప్పిన ప్రమాదం