
AP News: అమిత్షా పర్యటన.. నారాయణను అదుపులోకి తీసుకున్న పోలీసులు
తిరుపతి: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన దృష్ట్యా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి బైరాగిపట్టెడలో వాకింగ్ చేస్తుండగా ఆయనను అదుపులోకి తీసుకొని పీఎస్కు తరలించారు. అమిత్ షా పర్యటనను అడ్డుకుంటామని నారాయణ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్త చర్యగా ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.