Published : 06/10/2021 15:50 IST

Ts News: ప్రమాదకరంగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక, రాజకీయ విధానాలు: నారాయణ

హైదరాబాద్: సీపీఐ జాతీయ మహాసభలు వచ్చే ఏడాది అక్టోబర్ 14 నుంచి 18 వరకు విజయవాడలో జరగనున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో మహాసభలు జరగాల్సి ఉండగా కొవిడ్‌ వల్ల నిర్వహించలేకపోయినట్లు తెలిపారు. గ్రామస్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు అంశాలను మహాసభల్లో చర్చించనున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో చాడ వెంకట్‌ రెడ్డి, అజీజ్‌ పాషాతో కలిసి నారాయణ మీడియాతో మాట్లాడారు.

‘‘కేంద్ర మంత్రి కొడుకు కారును రైతుల మీదకు తీసుకెళ్లి చంపేశాడు. తప్పును కప్పిపుచ్చుకొనేందుకు రైతులే తన కొడుకును చంపడానికి ప్రయత్నించారని తప్పుడు ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరించే రాజకీయ, ఆర్థిక విధానాలు ప్రమాదకరంగా ఉన్నాయి. మాదక ద్రవ్యాలను తీసుకొనే వాళ్లను కాకుండా తయారు చేసే వారిని ప్రభుత్వాలు పట్టుకోవాలి. డ్రగ్స్‌ వ్యవహారంలో సినీనటులను మాత్రమే కాకుండా ఆదాని లాంటి వాళ్లను పట్టుకోవాలి. మోదీ ప్రభుత్వం కార్పొరేట్‌ దిగ్గజాలకు పెద్దపీట వేస్తోంది’’ అని నారాయణ అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో పోడు సాగుదారులపై అటవీ శాఖ అధికారులు దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికైనా పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని వామపక్షాలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తాయని హెచ్చరించారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని