CPI Narayana: మోదీ దేశాన్ని హోల్‌సేల్‌గా అమ్మేస్తున్నారు: నారాయణ

ప్రధాని మోదీ సర్కారు దేశాన్ని హోల్‌సేల్‌గా కార్పొరేట్‌ కంపెనీలకు అమ్మేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు.

Updated : 16 Sep 2021 14:47 IST

శ్రీకాకుళం: ప్రధాని మోదీ సర్కారు దేశాన్ని హోల్‌సేల్‌గా కార్పొరేట్‌ కంపెనీలకు అమ్మేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణతో దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతోందని.. ఇందుకు కారణమైన ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో  ఆయన మీడియాతో మాట్లాడారు.  19 రాజకీయ పార్టీలతో కలిసి ఈ నెల 27న భారత్‌బంద్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రైవేటు కంపెనీలకు పెద్ద మొత్తంలో రాయితీలు ఇచ్చి.. ప్రభుత్వ రంగ సంస్థలకు రిక్తహస్తం చూపిస్తున్నారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని