CPI Narayana: ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు: ఏపీ సర్కారుకు మద్దతిస్తాం: నారాయణ

కేంద్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యం వల్లే న్యాయ వ్యవస్థలో నిఘా వ్యవస్థ నీరుగారుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ కార్యాలయంలో

Published : 15 Sep 2021 01:58 IST

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యం వల్లే న్యాయ వ్యవస్థలో నిఘా వ్యవస్థ నీరుగారుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...  పెగాసెస్‌ అంశంపై మీకు సంబంధం ఉందా? లేదా? అని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తుంటే.. దేశ భద్రత విషయం చెప్పకూడదని కేంద్రం చెబుతోందని దుయ్యబట్టారు. న్యాయవ్యవస్థకు, పరిపాలనా విభాగానికి ప్రచ్ఛన్న యుద్ధం తలెత్తే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈనెల 17న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలంగాణకు వచ్చే ముందు కేంద్ర ప్రభుత్వం సాయుధ పోరాటాన్ని అధికారికంగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ సాయుధ పోరాటానికి భాజపాకు ఏం సంబంధమని ప్రశ్నించారు. 

‘‘హుస్సేన్‌ సాగర్‌లో గణేశ్‌ నిమజ్జనం వల్ల నీటి కాలుష్యం జరుగుతుందని హైకోర్టు చెప్పింది. హైకోర్టు సూచనను గణేశ్‌ ఉత్సవ కమిటీ పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా హైకోర్టు తీర్పును అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సినిమా టికెట్‌లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలని చెబుతోంది. ఇది మంచి నిర్ణయం. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ధర ఉంటోంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి మా మద్దతు ఉంటుంది. సినిమా నిర్మాతలు దోపిడీ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సినిమా టికెట్‌ల విషయంలో అలాగే చేయాలి’’ అని నారాయణ సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని