Dalit bandhu: అర్హులందరికీ దళిత బంధు.. ఎవరూ ఆందోళన చెందొద్దు: సీఎస్
అర్హులైన వారందరికీ దళిత బంధు అందజేస్తామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ తెలిపారు
కరీంనగర్: అర్హులైన వారందరికీ దళిత బంధు అందజేస్తామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ తెలిపారు. గ్రామ సభల ద్వారా దళిత బంధు సాయాన్ని పంపిణీ చేస్తామని వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టు కింద ముందుగా హుజూరాబాద్‌లో అమలు చేస్తున్నట్లు చెప్పారు. హుజూరాబాద్‌లో ఈ నెల 16న జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లపై మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తో పాటు సీఎస్ సమీక్షించారు. బహిరంగ సభ ఏర్పాట్లు, దళిత బంధు సాయం పంపిణీ, తదితర అంశాలపై సమీక్షించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పరిధిలోని శాలపల్లి ఇందిరానగర్‌లో దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు.. అద్భుతమైన పథకం అని.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. 15 మంది లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా చెక్కులను అందజేయనున్నట్లు సీఎస్ వెల్లడించారు.
నూరు శాతం అందిస్తాం: హరీశ్‌రావు
సభ ఏర్పాట్లపై కరీంనగర్ కలెక్టరేట్లో సమీక్ష అనంతరం మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘భాజపా నేతలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు. రైతు బంధు ప్రారంభించినప్పుడు కూడా ఇలానే అపోహలు సృష్టించారు. ఓటమి భయంతో ప్రజలను రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు. ఎల్లుండి సీఎం చేతుల మీదుగా హుజూరాబాద్‌లో దళిత బంధు పథకం లాంఛనంగా ప్రారంభం అవుతుంది. పైలట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్‌ను సీఎం ఎంపిక చేశారు. దళిత బంధు పథకం అర్హులందరికీ నూరు శాతం అందిస్తాం. ఈ పథకానికి రూ.2వేల కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గ ప్రజలకు మేలు జరిగితే ఎవరైనా ఆహ్వానిస్తారు. బండి సంజయ్ రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం శక్తి మేరకు రూ.10 లక్షలు అందిస్తున్నాం. మిగతా రూ.40 లక్షలు కేంద్రం నుంచి బండి సంజయ్ తీసుకురావాలి. కేంద్రం నుంచి ఆర్థిక సాయం తెస్తే పాలాభిషేకం చేస్తాం. దళిత బంధు సాయం అందించేందుకు ప్రతి గ్రామం, మున్సిపాలిటీలో ప్రత్యేక అధికారిని నియమించాం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా నియోజకవర్గంలో అర్హులందరికీ దళిత బంధు అందుతుంది’’ అని హరీశ్‌రావు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు.. ఎవరికీ రక్షణ లేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో ఆయన ప్రసంగించారు. -
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
చేవెళ్లలో పోటీ చేస్తున్నది కాసాని జ్ఞానేశ్వర్ కాదు కేసీఆర్ అన్నట్టుగా పార్టీ శ్రేణులు నిబద్ధతతో పనిచేయాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. -
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై 8,03,612 ఫిర్యాదులు వస్తే ఏసీబీ అధికారులు ఏం చర్యలు తీసుకున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. -
కేజ్రీవాల్‌కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
దిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు కేజ్రీవాల్‌కు సమయం లేదని, అందుకే తన భార్యను ఆ స్థానంలో కూర్చోబెట్టేందుకు సిద్ధమవుతున్నారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వ్యాఖ్యానించారు. -
కడియం నివాసానికి కాంగ్రెస్ నేతలు.. త్వరలో నిర్ణయం ప్రకటిస్తానన్న ఎమ్మెల్యే
వివిధ కారణాలతో ప్రజలు భారాసకు దూరమవుతున్నారని, కాంగ్రెస్‌లో చేరే అంశంపై త్వరలో నిర్ణయం వెల్లడిస్తానని భారాస నేత, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. -
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుని ఎన్నికల బరిలో దింపేందుకు ఎన్డీయే కూటమిలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. -
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
పెండింగ్‌లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను తెదేపా ప్రకటించింది. -
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
తమది విజన్.. జగన్‌ది పాయిజన్ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రచారయాత్రలో చంద్రబాబు మాట్లాడారు. -
బిహార్‌లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
బిహార్‌లో సీట్ల లెక్క తేలింది. ఇండియా కూటమి పార్టీలు పోటీ చేయబోయే స్థానాలు ఖరారయ్యాయి. -
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
శూన్యం నుంచి సునామీ సృష్టించి.. అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి కేసీఆర్ (KCR) అని భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) అన్నారు. -
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు.. ప్రజలకు సేవచేయడమని ఎన్టీఆర్ నిరూపించారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, నేతలకు ఎక్స్(ట్విటర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. -
సీఎం రేవంత్‌రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
సీఎం రేవంత్‌రెడ్డితో భారాస ఎంపీ కె.కేశవరావు (కేకే) భేటీ అయ్యారు. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డితో కలిసి కేకే సీఎం వద్దకు వెళ్లారు. -
బరిలో 15 మంది మాజీ సీఎంలు
లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల తరఫున 15 మంది మాజీ ముఖ్యమంత్రులు పోటీపడుతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీయే నుంచి, ముగ్గురు ఇండియా నుంచి కదన రంగంలో కాలుమోపుతున్నారు. -
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
రాయలసీమలో అన్యాయాలు చేస్తూ రూ.కోట్లకు పడగలెత్తిన పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన భావమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రశ్నించారు. -
బాలీవుడ్, హాలీవుడ్‌ను మించేలా జగన్నాటకాలు
మీ బలహీనతే జగన్ బలం. మద్యం ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి మోసం చేశారు. రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200 అయింది. -
రేపటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. -
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిందే
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిన బాధ్యత భాజపా కార్యకర్తలపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. -
ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బుస అనులేఖ
కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బుస అనులేఖ నియమితులయ్యారు. -
ఎంపీగా లేకున్నా.. మీ బిడ్డగా సేవ చేస్తా
‘‘ఎంపీగా నా పదవీకాలం ముగిసినా.. మీతో నా అనుబంధం చివరిశ్వాస వరకు కొనసాగుతుంది. పీలీభీత్ ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు నేను ఎల్లప్పుడూ పనిచేస్తా. -
వివేకా హంతకులు మీ పక్కనే ఉన్నారని అందరికీ తెలుసు: వర్ల రామయ్య
మాజీ మంత్రి వైఎస్ వివేకాపై గొడ్డలి వేటు వేయించింది వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి కాదా అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
లోక్‌సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్