
CWC Meet: జీ23 నాయకుల ఎఫెక్ట్.. త్వరలోనే సీడబ్ల్యూసీ సమావేశం..!
దిల్లీ: కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లేమి, పంజాబ్‌లోని పరిణామాలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ సీనియర్ నేతలు వ్యాఖ్యల అనంతరం అధిష్ఠానం మేల్కొన్నట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన అధిష్ఠానం అతి త్వరలోనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ సమావేశాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తున్నట్లు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇప్పటికే వెల్లడించారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా వెల్లడించారు.
వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు తక్షణమే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని సమావేశపరచాలని సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే జీ23 గ్రూప్‌గా ఏర్పడిన సభ్యులు అధినేతకు లేఖ రాసినట్లు వెల్లడించారు. ముఖ్యంగా పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలోనూ అధిష్ఠానం సరిగా వ్యవహరించడం లేదని విమర్శించారు. ఇవే విషయాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘జీ23’ అంటే ‘జీ హుజూర్ 23’ కాదని స్పష్టం చేసిన ఆయన.. పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడు లేకుండానే నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయనకు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ వంటి నేతలు మద్దతు తెలిపారు.
ఇవీ చదవండి
Advertisement