Telangana Politics: తెల్లకార్డు ఉన్న వారికి బెంజ్‌ కార్లు ఎలా వచ్చాయి?: దాసోజు

కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన ఇంద్రవెల్లి సభ విజయవంతమైందని.. పెద్ద సంఖ్యలో దళిత, గిరిజన ప్రజలు సభకు తరలివచ్చారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కుమార్‌

Published : 12 Aug 2021 01:25 IST

హైదరాబాద్: కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన ఇంద్రవెల్లి సభ విజయవంతమైందని.. పెద్ద సంఖ్యలో దళిత, గిరిజన ప్రజలు సభకు తరలివచ్చారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కుమార్‌ తెలిపారు. ఇంద్రవెల్లి సభతో తెరాసకు చురుకు తగిలిందన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కొంత మంది ప్రజాప్రతినిధుల విచక్షణ కోల్పోయి నోటికొచ్చినట్లు మాట్లాడటం సరి కాదన్నారు. బుధవారం దాసోజు మీడియాతో మాట్లాడారు.

‘‘కొంత మంది నేతలు నాలుకలు కోస్తామని అంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కత్తులు, కటారులు పట్టుకొని తిరుగుతున్నారా? మాకు కత్తులు దొరకవా? మేము నాలుకలు కోయలేమా? రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అవినీతికి పాల్పడిన నేతలు జైలుకు వెళ్లడం ఖాయం. సమస్యలపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే వివరణ ఇవ్వాల్సిన బాధ్యత అధికార పార్టీపై ఉంటుంది. కొంత మంది నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఎదురు దాడులు చేస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు బియ్యం తెచ్చుకుని తినేవారికి బెంజ్ కార్లు ఎలా వచ్చాయి?రేవంత్ రెడ్డి జైలుకు వెళతారని అంటున్నారు. మీ బాగోతాలు మాకు తెలియవా?మేము బైట పెట్టలేమా?ఏడేళ్లుగా దళిత, గిరిజన ప్రజల నోట్లో మట్టి కొట్టారు. పథకాల పేరుతో ఇవాళ ప్రజలను మభ్య పెడుతున్నారు. సమష్యలపై చర్చించేందు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉంది’’ అని దాసోజు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని