AP Politics: పవన్‌ రాజకీయాల్లో కంటే నటనలోనే గొప్పవాడు: ధర్మాన కృష్ణదాస్‌

జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ రాజకీయాల్లో కంటే నటనలోనే గొప్పవాడని, రాజకీయాల కోసం ఆయన ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలో శుక్రవారం చేనేత వస్త్ర ప్రదర్శనను

Updated : 28 Aug 2021 09:30 IST

శ్రీకాకుళం అర్బన్‌, న్యూస్‌టుడే: జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ రాజకీయాల్లో కంటే నటనలోనే గొప్పవాడని, రాజకీయాల కోసం ఆయన ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలో శుక్రవారం చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. పవన్‌ కల్యాణ్‌ అంటే తనకు వ్యక్తిగతంగా ఇష్టమన్నారు. జగన్‌మోహన్‌ రెడ్డిని విమర్శించే ముందు పవన్‌కల్యాణ్‌, లోకేశ్‌ ఆలోచించుకోవాలని హితవుపలికారు. కృష్ణా నదీజలాల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటాలు వదులుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. కొవిడ్‌ సమయంలో అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా స్టాంపుల కుంభకోణం జరిగిందని చెప్పారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని