Devineni Uma: తన ప్యాలెస్‌లు కాపాడుకునేందుకే జగన్‌ మౌనం: దేవినేని

బెంగళూరులో తనకున్న ప్యాలెస్‌లను కాపాడుకునేందుకే కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచుతున్నా ఏపీ సీఎం

Updated : 06 Sep 2021 14:06 IST

అమరావతి: బెంగళూరులో తనకున్న ప్యాలెస్‌లను కాపాడుకునేందుకే కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచుతున్నా ఏపీ సీఎం జగన్‌ పట్టించుకోవడం లేదని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. రాష్ట్ర రైతాంగ హక్కుల్ని తాకట్టు పెట్టే అధికారం ఆయనకు ఎవరిచ్చారని నిలదీశారు. తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉమ మాట్లాడారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తును దాదాపు ఐదున్నర మీటర్ల మేర పెంచి 18 అడుగుల మేర గేట్ల నిర్మాణం చేస్తుంటే సీఎం మొద్దునిద్రతో బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 

కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించే అక్రమ ప్రాజెక్టులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కేంద్ర గెజిట్‌లో వెలిగొండ ప్రాజెక్టు పేరు లేకపోయినా సీఎంలో కనీసం స్పందన లేదని ఆక్షేపించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 50శాతం వాటా ఉందని ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ దిల్లీలో మకాం వేసి ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలుస్తుంటే జగన్‌ ఏం చేస్తున్నారని ఉమ నిలదీశారు. అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల పరిరక్షణపై ఏనాడైనా అధికారులతో సమీక్ష నిర్వహించారా? అని ప్రశ్నించారు. గత 28 నెలల్లో పోలవరం పనులు ఎంతశాతం పూర్తిచేశారో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు