Devineni Uma: ఎందుకు నోరు మెదపరు?: దేవినేని ఉమ

కర్ణాటక ముఖ్యమంత్రి ఆల్మట్టి ఎత్తు పెంపు తథ్యమని మాట్లాడుతున్నా.. తెలంగాణ సీఎం కృష్ణా జలాల్లో 50 శాతం నీటి వాటా తమదే అంటున్నా..

Updated : 29 Aug 2021 15:22 IST

విజయవాడ: కర్ణాటక ముఖ్యమంత్రి ఆల్మట్టి ఎత్తు పెంపు తథ్యమని మాట్లాడుతున్నా.. తెలంగాణ సీఎం కృష్ణా జలాల్లో 50 శాతం నీటి వాటా తమదే అంటున్నా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌, మంత్రులు నోరు మెదపడం లేదని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. ఆల్మట్టి ఎత్తును 524 మీటర్లకు పెంచుతామని కర్ణాటక చెబుతుంటే ఎందుకు ఒక్క మాటా మాట్లాడటం లేదని నిలదీశారు. అసమర్థ వైకాపా ప్రభుత్వం రైతాంగ హక్కుల్ని కాపాడలేని పరిస్థితుల్లో ఉందని ఉమ విమర్శించారు. ట్రైబ్యునళ్ల ముందు మన వాదనలు వినిపించటంలో రాష్ర్ట ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆయన ఆక్షేపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని