Ap News: ఇబ్రహీంపట్నం కౌంటింగ్‌ కేంద్రం వద్ద దేవినేని ఉమా నిరసన

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని కౌంటింగ్‌ కేంద్రం వద్ద అధికారుల తీరుకు నిరసనగా మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమా ఆందోళకు దిగారు. కొండపల్లి మున్సిపల్‌ ఎన్నికల

Updated : 17 Nov 2021 20:39 IST

విజయవాడ: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని కౌంటింగ్‌ కేంద్రం వద్ద అధికారుల తీరుకు నిరసనగా మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమా ఆందోళకు దిగారు. కొండపల్లి మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌లో అధికారుల తీరును తప్పుబట్టారు. ఒకటో వార్డులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే.. వైకాపా విజయం సాధించినట్టు ప్రకటించారని ఆరోపించారు. 1వ వార్డు బ్యాలెట్‌ బాక్సుల సీలు అనుమానం కలిగించే రీతిలో ఉందని కౌంటింగ్‌ కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. గత రాత్రి ఒకటో వార్డు అభ్యర్థి ప్రమేయం లేకుండా సీల్‌ తొలగించారని ఆరోపించారు. అన్ని బ్యాలెట్‌ బాక్సుల సీల్‌కు గ్రీన్‌ కలర్‌ ఉంటే.. ఒకటో వార్డు బ్యాలెట్‌ బాక్సు సీల్‌ మరో కలర్‌లో ఉండటం అనుమానం కలిగిస్తోందన్నారు. దీనికి సంబంధించి సబ్‌ కలెక్టర్‌ కౌంటింగ్‌ కేంద్రం వద్దకు వచ్చే వరకు కదిలేది లేదని దాదాపు రెండు గంటల నుంచి ఉమాతో పాటు తెదేపా శ్రేణులు కౌంటింగ్‌ కేంద్రం వద్దే ఉన్నారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కొండపల్లిలో తెదేపా, వైకాపా మధ్య హోరా హోరీ పోరు జరిగింది. మొత్తం 29 వార్డుల్లో వైకాపా 14, తెదేపా 14 వార్డులు కైవసం చేసుకున్నాయి. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. అనంతరం తెదేపాలో చేరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని