దేవినేని ఉమను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన పోలీసులు

కృష్ణా జిల్లా నందివాడ పోలీస్‌ స్టేషన్‌ నుంచి భారీ భద్రత మధ్య మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును హనుమాన్‌ జంక్షన్‌ తరలించారు. హనుమాన్‌ జంక్షన్‌ సీఐ ఆఫీసులో

Updated : 28 Jul 2021 18:21 IST

నందివాడ: కృష్ణా జిల్లా నందివాడ పోలీస్‌ స్టేషన్‌ నుంచి భారీ భద్రత మధ్య మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును హనుమాన్‌ జంక్షన్‌ తరలించారు. హనుమాన్‌ జంక్షన్‌ సీఐ ఆఫీసులో జూమ్‌ యాప్‌ ద్వారా వర్చువల్‌గా మైలవరం కోర్టు జడ్జి ఎదుట ఉమాను హాజరుపర్చారు. దేవినేని ఉమాకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. రాజమహేంద్రవరం జైలుకు తరలించాలని ఆదేశించారు. ఉమాను అరెస్టు చేసిన తర్వాత ఉదయం 6గంటలకు నందివాడ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అప్పటినుంచి నందివాడలో హై అలర్ట్‌ ప్రకటించడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దేవినేని ఉమాతో స్టేషన్‌ నుంచి బయలుదేరిన పోలీస్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు తెదేపా శ్రేణులు అడుగడుగునా ప్రయత్నించారు. భారీగా మోహరించిన పోలీసు బలగాలు వారిని అడ్డుకున్నాయి. భారీ బందోబస్తు మధ్య దేవినేని ఉమాను కోర్టుకు తరలించారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని