Telangana Politics: కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ విఫలం: డీకే అరుణ 

కృష్ణా జలాలను వినియోగించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు..

Updated : 18 Aug 2021 02:35 IST

హైదరాబాద్‌: కృష్ణా జలాలను వినియోగించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాన్ని సీఎం కేసీఆర్‌ అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో అరుణ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో 66 శాతం కృష్ణా నదీ పరివాహక ప్రాంతం ఉందన్నారు. అందుకు కోసం రాష్ట్రానికి 535 టీఎంసీల నీరు కావాల్సి ఉండగా.. కేవలం 299 టీఎంసీల వాటా తీసుకోవడానికి మాత్రమే సీఎం ఒప్పందం కుదుర్చుకున్నారని మండిపడ్డారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో కేసీఆర్ కుమ్మక్కారని విమర్శించారు. కేసీఆర్ లోపాయికారి ఒప్పందంతోనే రాయలసీమ ప్రాజెక్టు నడుస్తోందని ఆక్షేపించారు. ఏ ఒప్పందంతో కృష్ణా జలాలను తాకట్టుపెట్టారో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని