
Eatala Rajendar: నేను పేదల గొంతుకను.. గెలిపించండి: ఈటల
హుజూరాబాద్: ఉప ఎన్నికలో తెరాస గెలవలేదనే సీఎం కేసీఆర్ కొత్త ఎత్తుగడ వేస్తున్నారని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్కు తాను లొంగిపోయినట్లు గతంలోనూ లేఖ సృష్టించారని చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు తేల్చలేదన్నారు. బేతిగల్లో పలువురు నేతలు భాజపాలో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఈటల మాట్లాడుతూ దళితబంధు వద్దని తాను లేఖ రాసినట్లు సృష్టించారన్నారు. అందరికీ దళితబంధు ఇవ్వాలని తాను డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు.
‘‘నాకు సమర్థత, దమ్ము ఉన్నందునే పదవులు ఇచ్చారు. కేసీఆర్ ఇస్తున్న డబ్బులన్నీ మనవే.. తీసుకోండి. నేను రాజీనామా చేస్తేనే చాలా వచ్చాయి.. గెలిస్తే ఎన్ని వస్తాయో ప్రజలంతా ఆలోచించాలి’’ అని ఈటల పిలుపునిచ్చారు. అంతకుముందు సిరసపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. తాను పేదల గొంతుకనని.. గెలిపించాలని ప్రజల్ని కోరారు. అక్టోబర్ 30న కుప్పలు కుప్పలుగా కమలం గుర్తుపై ఓట్లు పడతాయని.. నవంబర్ 2న (ఓట్ల లెక్కింపు) తెరాస నేతల దిమ్మతిరుగుతుందని ఈటల వ్యాఖ్యానించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.