
Huzurabad by election: నన్ను అసెంబ్లీలో చూడొద్దని సీఎం పంతం పట్టినట్లున్నారు: ఈటల
కమలాపూర్: హుజూరాబాద్‌లో పోలీసులే స్వయంగా రక్షణ కల్పించి అధికార పార్టీ డబ్బులు పంచేలా చేశారని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ ఆరోపించారు. ఉప ఎన్నిక సందర్భంగా కమలాపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో మద్యం ఏరులైపారిందని.. రూ.వందలకోట్లు పంపిణీ చేశారని ఈటల ఆరోపించారు. ప్రజలే బహిరంగంగా తమకు డబ్బు అందలేదని చెప్పడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా ఆయన అభివర్ణించారు. ఈటల రాజేందర్‌ను అసెంబ్లీలో చూడొద్దని సీఎం కేసీఆర్ పంతం పట్టినట్లున్నారని.. అందుకే అధికారయంత్రాంగం సాయంతో సర్వశక్తులూ ఒడ్డుతున్నారని ఆరోపించారు. ప్రజలంతా దీన్ని ఎదుర్కోకపోతే సమాజం బానిసత్వంలోకి వెళ్లిపోతుందని.. ఆత్మగౌరవరం, ధర్మాన్ని గెలిపించుకోవాలని ఈటల పిలుపునిచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.