Updated : 02/12/2021 12:50 IST

Ts News: మరో రాజకీయ పోరాటానికి సిద్ధమవుతున్న ప్రజలు: ఈటల రాజేందర్‌

హైదరాబాద్‌: తెలంగాణలో ఉద్యమాలు, ఉద్యమ కేంద్రాలు లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయత్నాలు చేస్తున్నారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. కేసీఆర్ నియంత వైఖరికి తెలంగాణ ప్రజలు మరో రాజకీయ పోరాటానికి సిద్ధమవుతున్నారన్నారు. హైదరాబాద్ గన్‌పార్కు వద్ద తెలంగాణ అమరుడు పోలీసు కిష్టయ్య 12వ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఈటల నివాళులు అర్పించారు. అమరవీరులు కోరుకున్న స్వేచ్ఛాయూత, ప్రజాస్వామ్య తెలంగాణ రాలేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో నిర్బంధాలు, అణచివేతలు, అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని విమర్శించారు. స్వేచ్ఛగా ఒక వ్యక్తి ఏ రాజకీయ పార్టీలో ఉండాలో నిర్దేశించుకొనే హక్కు, స్వేచ్ఛగా ఒక పౌరుడు నచ్చిన వ్యక్తికి ఓటు వేసే పరిస్థితి రాష్ట్రంలో లేకుండా పోయిందని ఆక్షేపించారు. ఆనాడు కేసీఆర్ ఏ ఉద్యమాన్ని నమ్ముకున్నారో... అదే కేసీఆర్ ఇవాళ ఉద్యమాలు, ఉద్యమ కేంద్రాలు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. జరుగుతున్న పరిణామాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని.. ఆత్మగౌరవం కోసం మరో రాజకీయ పోరాటానికి సిద్ధమవుతున్నారని ఈటల పేర్కొన్నారు.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని