Eatala Rajender: ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్‌ ప్రమాణ స్వీకారం

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థిగా గెలుపొందిన ఈటల రాజేందర్‌ ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ..

Updated : 10 Nov 2021 14:19 IST

హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థిగా గెలుపొందిన ఈటల రాజేందర్‌ ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి‌, జితేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి హాజరయ్యారు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ అయిన ఈటల.. ఎమ్మెల్యే పదవికి జూన్‌ 12న రాజీనామా చేయడంతో హుజురాబాద్‌ ఎన్నిక అనివార్యమైంది. ఇటీవల నిర్వహించిన ఉప ఎన్నికలో ఆయన గెలుపొందిన విషయం తెలిసిందే.

ఈటల ప్రమాణ స్వీకారం అనంతరం కొండా విశ్వేశ్వర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈటల తెలంగాణ ఉద్యకారుడని చెప్పారు. ఉప ఎన్నికలో ఆయన గెలవడంతో ఉద్యమకారులంతా పార్టీలకతీతంగా సంబుర పడుతున్నారన్నారు. ఉద్యమకారుడికి మద్దతుగా తానూ ప్రమాణస్వీకార కార్యక్రమానికి వచ్చినట్లు కొండా విశ్వేశ్వర్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని