
Ts News: బండి సంజయ్ పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన రాలేదు: వినోద్ కుమార్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పట్ల భాజపా నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ అగ్రహం వ్యక్తం చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన రాలేదని స్పష్టం చేశారు. అయన పాదయాత్రలో ఎటు చూసినా పచ్చదనమే కనిపించిందని.. అందుకే సంజయ్‌కు ఏమి మాట్లాడాలో తెలియలేదని ఎద్దేవా చేశారు. విద్య, వైద్యం రంగాల్లో తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరూ చెప్పాల్సిన పని లేదన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు 5 మెడికల్ కళాశాలలుంటే ఇప్పుడు 9 కాలేజీలు ఉన్నాయని.. మరో నాలుగు కళాశాలలను ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో బండి సంజయ్ తెలంగాణ కోసం ఏం మాట్లాడారో చెప్పాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.