KTR: ఈనెల 15నాటికి గ్రామ కమిటీల నిర్మాణం పూర్తి: కేటీఆర్

తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. తెరాస సంస్థాగత కమిటీల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు

Updated : 24 Dec 2022 15:16 IST

హైదరాబాద్‌: తెరాస సంస్థాగత కమిటీల్లో చురుకైన క్రియాశీలక కార్యకర్తలకు చోటు కల్పించాలని పార్టీ ప్రధాన కార్యదర్శులకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ దిశా నిర్దేశం చేశారు. మహిళ కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సంస్థాగత కమిటీల నిర్మాణంపై పార్టీ ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. గ్రామ కమిటీల నిర్మాణం సుమారు 80 శాతం పూర్తయిందని.. ఒకట్రెండు రోజుల్లో మిగతావి పూర్తవుతాయని ప్రధాన కార్యదర్శులు ఆయనకు వివరించారు. ఈనెల 15 నాటికి గ్రామ, వార్డు స్థాయి కమిటీల నిర్మాణం పూర్తి కావాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఈనెల 20నాటికి మండల కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. మండల కమిటీలు పూర్తయిన తర్వాత జిల్లా అధ్యక్షులను సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు, ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులతో చర్చించి జిల్లా కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ వివరించారు. కమిటీల వివరాలన్నీ రాష్ట్ర కార్యాలయానికి పంపించాలన్నారు. వారం రోజుల్లో మరోసారి సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని