TS News: 2023 ఎన్నికల్లో తెరాసతో ఉద్యమమే: జావడేకర్‌

తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ విమర్శించారు.

Updated : 24 Sep 2022 16:12 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ విమర్శించారు. ఏడేళ్ల పాలనలో ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ చౌరస్తాకు చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జావడేకర్‌ పాల్గొని మాట్లాడారు. ‘‘ప్రజల్ని మభ్యపెడుతున్న తెరాస ప్రభుత్వాన్ని సాగనంపాలి. తెలంగాణలో హైవేల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నాం. 2023 ఎన్నికల్లో తెరాసతో ఉద్యమమే. హుజూరాబాద్‌ ఎన్నికల్లో భాజపాదే విజయం’’ అని జావడేకర్‌ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు