
Gangula Kamalakar: గొడవలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు సంజయ్ ప్రయత్నం: గంగుల
కరీంనగర్: భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంపై మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. గొడవలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారని గంగుల అన్నారు. కొవిడ్ నిబంధనలు పాటించే బాధ్యత భాజపా నేతలకు లేదా అని ఆయన ప్రశ్నించారు. కొవిడ్ వ్యాప్తి పెరిగితే ఎవరు బాధ్యులు అని అన్నారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కొవిడ్ ఆంక్షలు విధించట్లేదా?అని గంగుల ప్రశ్నించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నారు. కరీంనగర్ పోలీసులను అభినందిస్తున్నట్లు గంగుల తెలిపారు. సమూహం లేకుండా బండి సంజయ్ దీక్ష చేయొచ్చు కదా? అని ప్రశ్నించారు. బండి సంజయ్‌ది జాగరణ దీక్ష కాదని, కొవిడ్‌ను వ్యాప్తి చేసే దీక్ష అని విమర్శించారు. ఎవరైనా కొవిడ్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు. పోలీసుల అనుమతి కూడా లేకుండా దీక్ష చేయొచ్చా అని గంగుల అన్నారు. ఒక ఎంపీ చట్టాలను ఉల్లంఘిస్తే ఎలా? అని ప్రశ్నించారు. దిల్లీలో ఎవరైనా దీక్షలు చేస్తే కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేయాదా? అని ప్రశ్నించారు. ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు 317 జీవో ఇచ్చామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.