Updated : 14 Oct 2021 15:01 IST

HYD: అమీర్‌పేట్‌లో ప్రభుత్వాసుపత్రి ప్రారంభం.. భాజపా, తెరాస కార్యకర్తల ఆందోళన 

  

హైదరాబాద్: నగరంలోని అమీర్‌పేట్‌లో నూతన ప్రభుత్వాసుపత్రిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రారంభించారు. ఆస్పత్రి ఆవరణలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక్కడ వైద్యారోగ్యశాఖ 50 పడకల ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొచ్చింది. అధునాతన సౌకర్యాలతో ఏరియా ఆస్పత్రిని తీర్చిదిద్దారు. సాధారణ ఓపీ సేవలతో పాటు ఆపరేషన్‌ థియేటర్‌, ఆక్సిజన్ పడకలు అందుబాటులోకి ఉన్నాయి. 

మరోవైపు ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన శిలాఫలకం మీద ప్రోటోకాల్‌ ప్రకారం కిషన్‌రెడ్డి పేరు ముందు వరుసలో లేదని భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో తెరాస, భాజపా కార్యకర్తలకు వారికి పోటీగా నినాదాలు చేశారు. పరస్పర నినాదాలతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను అక్కడి నుంచి పంపేశారు. సభా వేదిక ఏర్పాటు చేసినా కిషర్‌రెడ్డి, తలసాని మాట్లాడకుండానే వెళ్లిపోయారు. 


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని