Ap News: మద్దతివ్వడమా.. రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోవడమా.. సీఎం నిర్ణయించుకోవాలి: జీవీ

రాజధాని అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు మద్దతివ్వడమా లేక రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోవడమా..

Updated : 07 Nov 2021 15:38 IST

అమరావతి: రాజధాని అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు మద్దతివ్వడమా లేక రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోవడమా.. అనేది సీఎం జగన్‌ నిర్ణయించుకోవాలని తెదేపా నేత జీవీ ఆంజనేయులు అన్నారు. మహాపాదయాత్రకు అద్భుతమైన స్పందన వస్తుండడంతో జగన్ కళ్లల్లో కారం పడినట్టుగా బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. మహాపాదయాత్ర రోజురోజుకీ పెద్ద ఉద్యమంలా మారుతోందని.. రైతులు, మహిళలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. 700 రోజులు సాగిన అమరావతి ఉద్యమంతో పోల్చితే 7 రోజుల మహాపాదయాత్రకు మంచి స్పందన వస్తుందన్నారు. రైతులు చేపట్టిన ఉద్యమాన్ని చిన్నచూపు చూసిన ప్రభుత్వానికి ఇప్పుడే వాస్తవాలు అర్థమవుతున్నాయని.. అందుకే పోలీసుల సాయంతో ఉద్యమాన్ని అడ్డుకోవాలని చూస్తోందని విమర్శించారు. మహాపాదయాత్ర కొనసాగితే వైకాపా ప్రభుత్వం పతనమవడం ఖాయమని సీఎం జగన్‌కు అర్థమైందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులే రాజధాని పాదయాత్రను ముందుకు నడిపించడానికి సిద్ధమయ్యారని తెలిపారు. రైతులిచ్చిన భూమితో రాష్ట్రాన్ని, రాజధానిని అభివృద్ధి చేయడం సీఎం జగన్‌ వల్ల కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుచూపు లేని సీఎం.. యువతకు ఉద్యోగాలిచ్చే అమరావతిని నాశనం చేశారని మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు