AP news: రమ్య హత్యకేసు నిందితుడ్ని 21 రోజుల్లో శిక్షించాలి: హర్షకుమార్

బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్యకేసులో నిందితుడిని దిశ చట్టం ప్రకారం 21 రోజుల్లో శిక్షించాలని, లేని పక్షంలో బాధిత కుటుంబం తరఫున ఉద్యమిస్తామని మాజీ ఎంపీ హర్షకుమార్‌ ...బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్యకేసులో నిందితుడిని దిశ చట్టం ప్రకారం 21 రోజుల్లో శిక్షించాలని, లేని పక్షంలో బాధిత కుటుంబం తరఫున ఉద్యమిస్తామని మాజీ ఎంపీ హర్షకుమార్‌

Published : 20 Aug 2021 01:38 IST

గుంటూరు: బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్యకేసులో నిందితుడిని దిశ చట్టం ప్రకారం 21 రోజుల్లో శిక్షించాలని, లేని పక్షంలో బాధిత కుటుంబం తరఫున ఉద్యమిస్తామని మాజీ ఎంపీ హర్షకుమార్‌ అన్నారు. గుంటూరులో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. వైకాపా ప్రభుత్వంలో హత్యలు, అత్యాచారాలు, దాడులు యథేచ్ఛగా జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు మొక్కుబడిగా పరిహారం ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారని, బాధిత కుటుంబానికి ఇచ్చే పరిహారంలో కూడా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డ్డారు. నిందితుడికి ఉరి శిక్ష వేసి.. సీఎం జగన్‌ న్యాయం చేస్తారని బాధిత కుటుంబం ఆశగా ఎదురు చూస్తోందని,  వారి నమ్మకం ప్రకారం 21 రోజుల్లో నిందితుడికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సెప్టెంబరు 24లోపు దిశ చట్టం ప్రకారం ఇప్పటికి ఎన్ని శిక్షలు విధించారో, ఎంత పరిహారం ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని