Hyderabad News: జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద భాజపా కార్పొరేటర్ల నిరసన.. ఉద్రిక్తత

నగరంలోని హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) ప్రధాన కార్యాలయం వద్ద భాజపా మెరుపు ధర్నాకు దిగింది.

Updated : 23 Nov 2021 14:12 IST

హైదరాబాద్‌: నగరంలోని హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) ప్రధాన కార్యాలయం వద్ద భాజపా మెరుపు ధర్నాకు దిగింది. మేయర్‌ ఛాంబర్‌లోకి వెళ్లేందుకు యత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. జనరల్‌ బాడీ మీటింగ్‌ పెట్టాలని, ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ భాజపా కార్పొరేటర్లు, కార్యకర్తలు నిరసన తెలిపారు. ఐదు నెలల క్రితం వర్చువల్ మీటింగ్‌ పెట్టినా పనులు జరగలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భాజపా శ్రేణులను అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు.

జనరల్‌ బాడీ మీటింగ్‌ జరిగితే మేయర్‌, తెరాస కార్పొరేటర్ల అవకతవకల బయటపడతాయనే నిర్వహించడం లేదని భాజపా కార్పొరేటర్లు ఆరోపించారు. అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు మంజూరు చేసి కాంట్రాక్టర్లకు డబ్బులివ్వడంలేదని మండిపడ్డారు. మేయర్‌ ప్రజాసమస్యలను పట్టించుకోవడం లేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని భాజపా శ్రేణులు హెచ్చరించాయి.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని