Nara Lokesh: లోకేశ్‌ నరసరావుపేట పర్యటనపై ఉత్కంఠ

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నరసరావుపేట పర్యటన ఉత్కంఠగా మారింది.

Updated : 09 Sep 2021 13:58 IST

విజయవాడ: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నరసరావుపేట పర్యటన ఉత్కంఠగా మారింది. ఈ పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. లోకేశ్‌ హైదరాబాద్‌ నుంచి గన్నవరం చేరుకోనున్న నేపథ్యంలో విమానాశ్రయం వద్ద భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచి విమానాశ్రయం వరకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. విమానాశ్రయంలోని ఎవరినీ అనుమతించడం లేదు. మరోవైపు నరసరావుపేట వెళ్లే  ప్రధాన మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. లోకేశ్‌ పర్యటన అనుమతి నిరాకరించిన నేపథ్యంలో పలువురు తెదేపా నేతలను నిర్బంధించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజా, సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జులు చదలవాడ అరవిందబాబు, కోడెల శివరామ్‌, గన్నవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి బచ్చుల అర్జునుడు సహా మరికొంత మందిని గృహ నిర్బంధం చేశారు.

సోనూసూద్‌ భద్రతా సిబ్బంది అడ్డగింత..

బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ ఈరోజు విజయవాడ రానున్నారు. ఈ నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సోనూసూద్‌ వ్యక్తిగత భద్రతా సిబ్బందిని సైతం పోలీసులు అడ్డుకున్నారు. లోకేశ్‌ పర్యటన వేళ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి విమానాశ్రయంలోకి ఎవరినీ అనుమతించని పోలీసులు సోనూసూద్‌ భద్రతా సిబ్బందినీ నిలిపివేశారు.

ఫొటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని