By Elections: హుజూరాబాద్‌, బద్వేలు ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల

తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ ఉప ఎన్నికలకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఏపీలోని బద్వేలు, తెలంగాణలోని హుజూరాబాద్‌ స్థానాలకు

Updated : 30 Sep 2022 15:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ ఉప ఎన్నికలకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఏపీలోని బద్వేలు, తెలంగాణలోని హుజూరాబాద్‌ స్థానాలకు ఈనెల 30న ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈనెల 8 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువుంది. నామినేషన్ల పరిశీలనకు ఈనెల 11, ఉపసంహరణకు 18వ తేదీ వరకు సమయం ఉంది. నవంబర్‌ 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్‌లో.. వైకాపా ఎమ్మెల్యే డా. వెంకట సుబ్బయ్య మృతిచెందడంతో బద్వేలు ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఇంటింటి ప్రచారానికి ఐదుగురికి మించి వెళ్లొద్దు: విజయానంద్‌

ఏపీలో ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా నిబంధనలు పాటించాలన్నారు. ఎన్నికల ప్రచారంలో ద్విచక్ర వాహన, ఇతర ర్యాలీను నిషేధించినట్లు చెప్పారు. నామినేషన్‌ వేసే సమయంలో అభ్యర్థితో పాటు ఒక్కరే వెళ్లాలన్నారు. ఇండోర్‌లో 200 మంది, బహిరంగ ప్రదేశాల్లో 1000 మందికి మించి సమావేశాలు నిర్వహించేందుకు అనుమతి లేదని చెప్పారు. దీనిపై ఇప్పటికే జిల్లా యంత్రాంగానికి, పోలీసుశాఖకు ఆదేశాలు ఇచ్చామని విజయానంద్‌ తెలిపారు. ఇంటింటి ప్రచారానికి ఐదుగురికి మించి వెళ్లకూడదన్నారు. వీధులు, కాలనీల్లో నిర్వహించే సమావేశాల్లో 50 మందికి మించ కూడదన్నారు. ఈ విషయాలను ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీలకు సూచించామని ఆయన వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని