TS News: హుజూరాబాద్‌ భాజపా అభ్యర్థిపై అధికారిక ప్రకటన 

హుజూరాబాద్ భాజపా అభ్యర్థి ఖరారయ్యారు. మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ను అభ్యర్థిగా

Updated : 03 Oct 2021 12:02 IST

హైదరాబాద్‌: హుజూరాబాద్ భాజపా అభ్యర్థి ఖరారయ్యారు. మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ను అభ్యర్థిగా ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేయడంతో హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నెల 30న ఎన్నిక జరగనుండగా.. వచ్చే నెల 2న ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఈ స్థానంలో అధికార పార్టీ తరఫున గెల్లు శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ తరఫున బల్మూరి వెంకట్‌ బరిలో ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని