Bandi sanjay: అధికారంలోకి వస్తే.. నిజాం ఆస్తులను స్వాధీనం చేసుకుంటాం: బండి సంజయ్‌

రాష్ట్రంలో భాజపా చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్ర సోమవారం ఆరే మైసమ్మ ఆలయం క్రాస్ రోడ్స్‌కు చేరుకుంది

Updated : 24 Sep 2022 16:15 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో భాజపా చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్ర సోమవారం ఆరే మైసమ్మ ఆలయం క్రాస్ రోడ్స్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ సమాజ ఆత్మగౌరవాన్ని కేసీఆర్‌ తాకట్టుపెట్టారని ఆరోపించారు. భాజపా అధికారంలోకి వస్తే.. నిజాం ఆస్తులను స్వాధీనం చేసుకుని ప్రజలకు అప్పగిస్తామన్నారు. భూములను ఆక్రమించుకుని కొందరు నిజాం ఆస్తులుగా ప్రచారం చేశారన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని ఎంఐఎం పార్టీతో తెరాసకు ఉన్న రహస్య ఒప్పందమేంటని ప్రశ్నించారు. ఒక్క కుటుంబం చేతిలో బందీ అయిన తెలంగాణ తల్లి ఘోషిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కోకాపేటలో దళితుల భూములను విక్రయించడాన్ని భాజపా ఖండిస్తోందన్నారు.

కేసీఆర్‌ డబ్బు గెలుస్తోందో.. నేను గెలుస్తానో చూద్దాం: రాజాసింగ్

‘‘గోషామహల్‌ అభివృద్ధికి రెండు వేల కోట్లు ఇస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. గోషామహల్‌లో కేసీఆర్‌ డబ్బు గెలుస్తోందో.. నేను గెలుస్తానో చూద్దాం. హుజూరాబాద్‌లో గెలిచేది డబ్బులు కాదు. ఈటల మాత్రమే గెలుస్తారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెరాస ప్రభుత్వం ఇచ్చిన పదివేలు తీసుకుని భాజపాకు ఓటు వేశారు’’ అని ఎమ్మెల్యే రాజాసింగ్‌ పేర్కొన్నారు.

మరిన్ని ఫొటోల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని