TS News: కేటీఆర్‌ను కలిస్తే తెరాస కండువా కప్పుతారా?: జగ్గారెడ్డి

తెరాసలో చేరాలనుకుంటే నేరుగా వెళ్తానని .. తనను ఎవరూ అడ్డగించలేరని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి మంత్రి కేటీఆర్‌ను కలిస్తే తెరాసలో చేరుతున్నారంటూ ప్రచారం చేయడం తగదన్నారు.

Updated : 02 Jan 2022 22:41 IST

హైదరాబాద్‌: తెరాసలో చేరాలనుకుంటే నేరుగా వెళ్తానని .. తనను ఎవరూ అడ్డగించలేరని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి మంత్రి కేటీఆర్‌ను కలిస్తే తెరాసలో చేరుతున్నారంటూ ప్రచారం చేయడం తగదన్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను జగ్గారెడ్డి ఖండించారు. తెరాస ఏజంట్‌నో .. కోవర్ట్‌నో అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెదక్‌ అభ్యర్థిగా తన భార్యను ఎందుకు పోటీలో పెడతానని ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాల్లో తనపై బురదజల్లుతుంటే పీసీసీ ఎందుకు ఖండించలేదని నిలదీశారు. కేటీఆర్‌ను కలిస్తే ఆ పార్టీ కండువా కప్పి.. యూట్యూబ్‌ ఛానళ్లలో వార్తలు ఎలా రాస్తారని జగ్గారెడ్డి నిలదీశారు. ఒకట్రెండు యూట్యూబ్‌ ఛానళ్లు మరీ ఇష్టానుసారంగా రాస్తున్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని