Updated : 06/10/2021 15:43 IST

Ts News: మోదీ ప్రధాని అయ్యాక భావోద్వేగ రాజకీయాలు నడుస్తున్నాయ్‌: జగ్గారెడ్డి

హైదరాబాద్: కులమతాల పేరుతో భాజపా రెచ్చగొట్టే రాజకీయం చేస్తోందని సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. మోదీ ప్రధాని అయ్యాక భావోద్వేగ రాజకీయాలు నడుస్తున్నాయని పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలను తీసుకురావడం ద్వారా కేంద్ర ప్రభుత్వం.. రైతుల నడ్డి విరుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర భారతంలో 200 రోజులుగా రైతులు ఉద్యమం చేస్తుంటే భాజపా ప్రభుత్వంలో చలనం రాదా? అని ప్రశ్నించారు. రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న ప్రియాంక గాంధీని అరెస్టు చేశారని.. ఇదేం ప్రజాస్వామ్యమని నిలదీశారు. ప్రియాంక గాంధీని వెంటనే విడుదల చేయకపోతే తామంతా రోడ్ల మీదికి రావాల్సి ఉంటుందని.. సంగారెడ్డి నుంచి ఉద్యమం పెదలు పెడతానని హెచ్చరించారు.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని