AP News: చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన జమ్మలమడుగు నేతలు 

రాష్ట్రాన్ని  కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. కడప జిల్లా జమ్మలమడుగు నేతలు మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి..

Published : 26 Nov 2021 16:11 IST

అమరావతి: రాష్ట్రాన్ని  కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. కడప జిల్లా జమ్మలమడుగు నేతలు మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఆయన కుమారుడు భూపేష్ రెడ్డిలు తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు.  మాజీ మంత్రి, ప్రస్తుత భాజపా నేత ఆదినారాయణరెడ్డికి నారాయణరెడ్డి సోదరుడు. ఈ సందర్భంగా చంద్రబాబు.. భూపేష్‌రెడ్డికి జమ్మలమడుగు బాధ్యతలు అప్పగించారు. జమ్మలమడుగు తెదేపాకు కంచుకోటని తెలిపారు. జమ్మలమడుగులో పార్టీకోసం పనిచేస్తున్న అందరికీ గుర్తింపు ఉంటుందని చంద్రబాబు తెలిపారు. 

జగన్‌రెడ్డి అన్నీ గాలిమాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారు ఉంటారనే ఆనాడు అంబేడ్కర్‌ రాజ్యాంగం రాశారన్నారు. సీఎం గాల్లో వచ్చారు.. గాల్లోనే వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. సినిమా టిక్కెట్లు ఆన్‌లైన్‌లో పెట్టి అప్పు తెచ్చుకుంటారని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులు అమ్ముతున్నారు లేకపోతే తాకట్టు పెడుతున్నారు,  సీఎంకు అనుభవం లేదు అహంభావం మాత్రం ఉందని విమర్శించారు. వలస పక్షులకు ఇక పార్టీలో అవకాశం లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారు, ఎవరు పనిచేయడం లేదనేది రాసిపెడుతున్నానని, ఈసారి పనిచేసే వారికి మాత్రమే పార్టీలో పదవులని స్పష్టం చేశారు. పార్టీ మారి వచ్చే వాళ్లకు అవకాశం ఉండదని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని