Updated : 22 Jul 2021 11:50 IST

AP News: ప్రతి గింజకూ డబ్బు చెల్లించాలి: పవన్‌ 

అమరావతి: ఏపీలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు, లెక్కలను ప్రభుత్వం గోప్యంగా ఎందుకు ఉంచుతోందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌ నుంచి ఈ వివరాలను ఎందుకు తొలగించారో రైతులకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పవన్‌ ఓ ప్రకటనలో విడుదల చేశారు. రైతులకు ధాన్యం సొమ్ములు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ నెలాఖరులోగా ప్రతి గింజకూ డబ్బు చెల్లించాలని.. లేనిపక్షంలో రైతుల కోసం పోరాడతామని హెచ్చరించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా డబ్బులెందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.

ప్రభుత్వం రైతులకు రూ.3 వేల కోట్లకు పైగా బకాయి పడిందని పవన్‌ అన్నారు. రబీ సీజన్లో కొనుగోలు చేసిన ధాన్యానికి ఉభయ గోదావరి జిల్లాల్లోనే రూ.1800 కోట్ల వరకూ బకాయిలు ఉన్నాయని ఆక్షేపించారు. గతంలో రైతుల కోసం కాకినాడలో ‘రైతు సౌభాగ్య దీక్ష’ చేపడితేనే ప్రభుత్వం దిగి వచ్చి రైతులకు సొమ్ములు జమ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రబీ డబ్బులు వస్తేనే ఈ సీజన్లో పంటకు పెట్టుబడి ఉంటుందన్నారు. బకాయిల కారణంగా కోనసీమలోని గ్రామాల్లో రైతులు పంట వేయబోమని క్రాప్ హాలిడే ప్రకటించారని పవన్‌ గుర్తు చేశారు.

జొన్న, మొక్క జొన్న కొనుగోలు విషయంలోనూ రైతులను పార్టీలవారీ విడదీయడం దురదృష్టకరమని పవన్‌ కల్యాణ్‌ దుయ్యబట్టారు. అధికార పార్టీకి మద్దతుగా ఉన్నవారి నుంచే పంటను కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పండించే పంటకు, తినే తిండికీ పార్టీ రంగులు పులమడం దిగజారుడుతనమేనని పవన్‌ విమర్శించారు. నకిలీ విత్తనాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. జనసేన రైతుల పక్షాన ఉంటుందని.. వారి కోసం నిరంతరం పోరాడుతుందని పవన్‌ పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని