AP News: విశాఖ ఉపాధి కార్యాలయం ముట్టడి

ఏపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌ను రద్దు చేసి కొత్త క్యాలెండర్‌ను ప్రకటించాలని

Updated : 20 Jul 2021 14:18 IST

విశాఖ: ఏపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌ను రద్దు చేసి కొత్త క్యాలెండర్‌ను ప్రకటించాలని జనసేన నిరసన కార్యక్రమం చేపట్టింది. ఇవాళ జిల్లా ఉపాధి అధికారులకు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించిన జనసేన అందులో భాగంగా విశాఖలో ఉపాధి కార్యాలయాన్ని ముట్టడించింది. ఉపాధి కార్యాలయానికి తాళం వేయడంతో జనసేన కార్యకర్తలు అధికారిని బయటే కలిశారు. ఈ క్రమంలో పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంచరపాలెం, ఊర్వశి, ఐటీఐ కూడళ్లలో భారీగా పోలీసులు మోహరించారు. ఉపాధి కార్యాలయానికి 200 మీటర్ల పరిసరాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

విజయవాడలో..

విజయవాడలోని ఉపాధి కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడానికి జనసేన నేత పోతిన మహేశ్ వెళ్లగా.. అధికారులే బయటికి రావడంతో అక్కడే వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ.. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ అన్నారు.. జాబ్‌ లెస్‌ క్యాలెండర్‌ ప్రకటించారని మండిపడ్డారు. జాబ్‌ లెస్‌ క్యాలెండర్‌పై ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? అని ప్రశ్నించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని