Updated : 12 Dec 2021 12:18 IST

Pawan Kalyan: విశాఖ ఉక్కు కార్మికులకు మద్దతుగా పవన్‌ దీక్ష ప్రారంభం

అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకునేందుకు కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ దీక్షకు దిగారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన నిరసన దీక్ష చేపట్టారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికుల ఆందోళన 300 రోజులకు పైగా సాగుతోందని.. వారికి నైతికంగా మద్దతు ఇచ్చేందుకు పవన్‌ దీక్ష చేపట్టినట్లు జనసేన వర్గాలు వెల్లడించాయి.

వడ్డేశ్వరంలో పవన్‌ శ్రమదానం

మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లే మార్గంమధ్యలో పవన్‌ శ్రమదానం చేశారు. గుంటూరు జిల్లా వడ్డేశ్వరం వద్ద పారపట్టి కంకరను గుంతల్లో వేశారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితిని నిరసిస్తూ పవన్‌ ఈ కార్యక్రమం చేపట్టారు. అనంతరం పార్టీ కార్యాలయానికి వెళ్లి విశాఖ ఉక్కు కార్మికుల పోరాటానికి సంఘీభావంగా దీక్షలో కూర్చొన్నారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని