Janasena: రహదారుల మరమ్మతులపై ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తాం: నాదెండ్ల

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పాడైపోయిన రహదారుల మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌

Updated : 27 Aug 2021 16:27 IST

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పాడైపోయిన రహదారుల మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాడైన రహదారులపై గాంధీ జయంతి సందర్భంగా శ్రమదానం నిర్వహిస్తామని వెల్లడించారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ రెండు చోట్ల శ్రమదానంలో పాల్గొంటారని స్పష్టం చేశారు. సెప్టెంబర్‌ 2, 3, 4వ తేదీల్లో రోడ్ల దుస్థితిపై నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ‘జేఎస్పీ ఫర్‌ ఏపీ’ పేరుతో హ్యాష్‌ట్యాగ్‌ను మనోహర్‌ ఆవిష్కరించారు. అక్టోబర్‌ నాటికి పరిస్థితి మారకపోతే శ్రమదానం ద్వారా తామే రోడ్లు వేసేందుకు ప్రయత్నిస్తామని నాదెండ్ల స్పష్టం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు