
Updated : 04 Jan 2022 16:40 IST
TS News: జైల్లో బండి సంజయ్‌కు కిషన్‌రెడ్డి, ఈటల పరామర్శ
కరీంనగర్: కరీంనగర్ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు. సంజయ్‌ను కలిసేందుకు కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, వివేక్‌కు అనుమతి ఇచ్చారు. దీంతో వీరు ములాఖత్ సమయంలో సంజయ్‌తో మాట్లాడారు. మరోవైపు కరీంనగర్‌లోని బండి సంజయ్ కార్యాలయాన్ని కిషన్‌రెడ్డి పరిశీలించనున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల జీవో 317ను సవరించాలని డిమాండ్ చేస్తూ సంజయ్ కరీంనగర్‌లో చేపట్టిన జాగరణ దీక్ష అనంతర పరిణామాలు ఆయన 14రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌కు దారితీసిన విషయం తెలిసిందే.
Tags :