TS News: ఇంధన, గ్యాస్‌ ధరల పెరుగుదలను నిరసిస్తూ కోదండరామ్ దీక్ష

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ సత్యగ్రహ దీక్షకు దిగారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల

Updated : 29 Jul 2021 12:44 IST

హైదరాబాద్‌: తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ సత్యగ్రహ దీక్షకు దిగారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలను నిరసిస్తూ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేపట్టారు. సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. కోదండరామ్‌తో పాటు పలువురు ఆ పార్టీ నేతలు సత్యాగ్రహ దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా కోదండరామ్‌ మాట్లాడుతూ.. దేశ ఆర్థిక రంగానికి ప్రధాన వనరు ఇంధనం అని.. దాన్ని ప్రభుత్వం చౌకగా ఇవ్వలేకపోతే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడలేము అని చెప్పారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల ఆధారంగా రూ.50 పెట్రోల్‌ ఇవ్వొచ్చని కోదండరాం చెప్పారు. ఈ ధరకు పెట్రోల్‌ ఇవ్వడం సాధ్యమే అని.. లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని