AP News: కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక.. 750మంది పోలీసులతో భద్రత

ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక ఇవాళ ఉదయం నిర్వహించనున్నారు...

Updated : 24 Nov 2021 13:49 IST

కొండపల్లి: ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక ఇవాళ ఉదయం నిర్వహించనున్నారు. గత రెండు రోజులుగా ఛైర్మన్‌ ఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు పునరావృతం కాకుండా పోలీసులు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కొండపల్లి మున్సిపల్‌ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. నిన్న 400 మంది కార్యాలయం ప్రాంగణంలో పహారా ఉండగా.. ఇవాళ 750 పోలీస్‌ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు కోర్టును ఆశ్రయించిన తెదేపా కౌన్సిలర్లు, స్వతంత్ర అభ్యర్థి కె.శ్రీలక్ష్మి, ఎంపీ కేశినేని నానికి పోలీసు భద్రత కల్పించాలని విజయవాడ ఇంఛార్జి పోలీసు కమిషనర్‌ జి.పాలరాజుకు కోర్టు నిన్న స్పష్టం చేసింది. ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌ ఎన్నికను నిర్వహించాలని.. కానీ ఫలితాలు ప్రకటించొద్దని ఆదేశించింది. ఎంపీ కేశినేని నాని ఓటు వినియోగం ఈ వ్యాజ్యంలో తాము ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అనంతరం విచారణను ఈనెల 25కు వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని