Updated : 14/11/2021 08:09 IST

AP News: తెదేపా అభ్యర్థి భర్త అర్ధరాత్రి పీఎస్‌కు తరలింపు.. కోటంరెడ్డి నిరసన 

నెల్లూరు: నెల్లూరులో రేపు జరగనున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో 4వ డివిజన్‌ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి భర్త.. మామిడాల మధును అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న నవాబుపేట పోలీసులు పీఎస్‌కు తరలించారు. అతని జేబులో రూ.2వేలు ఉన్నాయనే సాకుతో అక్రమంగా నిర్బంధించారని తెదేపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సమాచారం అందుకున్న తెదేపా నగర నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి స్టేషన్‌కు చేరుకున్నారు. అర్ధరాత్రి నుంచి ఆయన స్టేషన్‌ ఆవరణలో బైఠాయించారు. మధును విడుదల చేయకపోవడంతో కోటంరెడ్డి నిరసన కొనసాగుతోంది. 4వ డివిజన్‌లో తెదేపా అభ్యర్థి విజయం ఖాయం కావడంతో మంత్రి అనిల్‌ ప్రోద్బలంతోనే పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని కోటంరెడ్డి ఆరోపించారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని