TS News: రేపు తెరాసలోకి కౌశిక్ రెడ్డి
హుజూరాబాద్ నాయకుడు కౌశిక్ రెడ్డి అధికార పార్టీ తెరాసలో చేరనున్నారు.
హైదరాబాద్: హుజూరాబాద్ నాయకుడు కౌశిక్ రెడ్డి అధికార పార్టీ తెరాసలో చేరనున్నారు. రేపు మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో చేరేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. కౌశిక్‌రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
హుజూరాబాద్ అభివృద్ధికే తెరాసలోకి: కౌశిక్
హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను తెరాసలో చేరుతున్నట్లు కౌశిక్‌రెడ్డి తెలిపారు. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు తెరాసలో చేరుతానని వెల్లడించారు. కొండాపూర్‌లోని నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన మాట్లాడారు. ‘‘పెద్దఎత్తున నా సైనికులు రేపు తెలంగాణ భవన్‌కు రావాలని కోరుతున్నా. సీఎం కేసీఆర్ కృషితో రైతులంతా సంతోషంగా ఉన్నారు. కాళేశ్వరం, ఎల్‌ఎండీ జలాలతో సమృద్ధిగా పంటలు పండుతున్నాయి. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ ఎన్నో పథకాలు తెచ్చారు. ఈటల రాజేందర్ హుజూరాబాద్ అభివృద్ధిని విస్మరించారు. ప్రజా సమస్యల కోసం కాదు.. స్వలాభం కోసం ఆయన రాజీనామా చేశారు’ అని కౌశిక్ అన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు
-
Crime News
కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Movies News
దేవుడితో పని పూర్తయింది!.. పవన్‌తో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్‌ను పంచుకున్న సముద్రఖని
-
Ap-top-news News
ఎమ్మెల్యే అనిల్ ఫ్లెక్సీకి పోలీసుల పహారా