
TS News: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోరు.. కారుకు 6 స్థానాలు ఏకగ్రీవం, మరో ఆరింటిలో పోటీ
ఇంటర్నెట్ డెస్క్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఇవాళ్టితో ముగిసింది. ఎమ్మెల్సీ పోరులో ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మరో ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి తెరాస అభ్యర్థిగా దండెం విఠల్, స్వతంత్ర అభ్యర్థిగా పుష్పరాణి బరిలో నిలిచారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 14 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. చివరకు తెరాసకు చెందిన భాను ప్రసాదరావు, ఎల్ రమణతో పాటు మరో 8మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్‌సింగ్ పోటీ చేస్తున్నారు. మెదక్ జిల్లాలో తెరాస అభ్యర్థిగా యాదవరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా నిర్మల, స్వతంత్ర అభ్యర్థిగా మల్లారెడ్డి పోటీలో ఉన్నారు. ఖమ్మం జిల్లా నుంచి తెరాస తరఫున తాతా మధు, కాంగ్రెస్ నుంచి రాయల నాగేశ్వరరావు సహా మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తెరాస నుంచి కోటిరెడ్డితో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీపడనున్నారు.
ఆరు స్థానాల్లో తెరాస ఏకగ్రీవం
రంగారెడ్డి జిల్లా నుంచి పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజు, వరంగల్ స్థానం నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కల్వకుంట్ల కవిత, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచికుళ్ల దామోదర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఆరుగురు తెరాస అభ్యర్థులకు ఎన్నికల అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.